15-10-2025 08:38:00 PM
ఉప్పల్ (విజయక్రాంతి): అర్హత లేనివారిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆడిస్తున్నారని కోట రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జూనియర్ సెలక్షన్ చేసే ఐదుగురుపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోట రామరావు అనే వ్యక్తి తన కుమారుడు రాహుల్ కార్తికే అండర్ 16 అండర్ 19 అండర్ 23 లీగల్ లో ప్రతిభ కనబరిచిన సెలక్షన్ కమిటీ డబ్బులు అడిగితే ఇవ్వలేదని సెలక్షన్ నుండి తొలగించారంటూ ఇటీవల కాలంలో సిపి రాచకొండ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేయడంతో సిపి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.