11 May, 2026 | 10:20 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు

11-05-2026 09:19 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): స్వశక్తి సంఘాల బ్యాంకింగ్ కేజీ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా అత్యున్నత ప్రతిభ కనబరిచినందుగాను రాష్ట్రంలో స్వశక్తిసంఘాల లింకేజీలో పెద్దపల్లి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అందుకుగాను గురువారం రోజు హైదరాబాద్ ప్రజా భవన్ లో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకు లింకేజీ అవార్డుల కార్యక్రమంలో పంచాయతీరాజ్ మరియుగ్రామీణ అభివృద్ధి శాఖామాత్యులు దనసరి సీతక్క చేతుల మీదుగా అవార్డును ప్రధానం చేయడం జరిగింది. ఈ అవార్డును పెద్దపల్లి జిల్లా పక్షాన హాజరైన గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాలిందిని, అడిషనల్ డిఆర్డిఓ బి.రవీందర్, డిపిఎం  వెంకటరమణయ్య తోపాటు చైతన్య జ్యోతి జిల్లా సమాఖ్య కార్యదర్శి జె.శోభ అందుకున్నారు.

 జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం 2025- 2026 కు గాను 7716 స్వయం సహాయక సంఘాలకు  గాను 477.86 కోట్ల లక్ష్యాన్ని జిల్లాకు నిర్దేశించగా,  అందుకుగాను   6851 స్వశక్తిసంఘాలకు 454.66  కోట్ల లక్ష్యాన్ని  సాధించి రాష్ట్రస్థాయిలో స్వయం సహాయక సంఘాల కవరేజీలో మొదటి స్థానంలో నిలిచింది.

స్వశక్తి సంఘాలకు బ్యాంకులు కేజీని అందించి వారి ఆదాయ వృద్ధి మరింత మెరుగుపరచడానికి జిల్లాలోని సెర్ప్ సిబ్బంది అందరూ సమిష్టిగా కృషి చేసి సశక్తి సంఘాల లింకేజీలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపారు. అదేవిధంగా సంఘాల రీపేమెంట్ విషయంలో కూడా జిల్లా రాష్ట్రంలో కేవలం 0.85% ఎన్పీఏ ఉండడం వల్ల రిపేమెంట్లో కూడా అగ్రస్థానంలో నిలిచింది.

అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరంలోనే స్త్రీ నిధి మహిళా బ్యాంకు ద్వారా కూడా సస శక్తి సంఘాలకు పెద్ద ఎత్తున లోన్ లిపించడం మరి మరియు రికవరీ చేయడంలో కూడా పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో అగ్రభాగాన నిలిచి స్త్రీనిధి జనరల్ బాడీ సమావేశంలో అవార్డులను అందుకున్నారు. సర్ప సిబ్బంది అందరూ సమిష్టిగా ఇదే స్ఫూర్తితో పనిచేసి పెద్దపల్లి జిల్లాను అన్ని అంశాలలో అగ్రభాగా న నిలపాలని ఈ సందర్భంగా సెర్ప్ సిబ్బంది అందరిని జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష  అభినందించారు