తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం
జవహర్ నగర్,(విజయక్రాంతి): తాగి ఇంటికి వచ్చాడని తల్లి మందలించడంతో మనస్థాపం చెందిన ఓ తనయుడు ఇంటి నుంచి బయలకు వెళ్ళి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... జవహర్ నగర్లోని నందమూరినగర్ లో నిషా నలుగురు కుమారులతో కలిసి జీవనం సాగిస్తుంది. చిన్న కుమారుడైన రబ్బానీ అన్సారీ(26)కు వివాహం కాలేదు.
అంబేద్కరనగర్లో పంచర్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 8న మద్యం తాగి ఇంటికి రావడంతో తల్లి నిషా కుమారుడిని మందలించింది. దీంతో మనస్థాపం చెందిన కుమారుడు రబ్బానీ అన్సారీ ఇంట్లో చెప్పకుండ బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. అతని అచూకి కోసం చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికిన సమాచారం లభించలేదు. ఈ మేరకు కుటుంబసభ్యులు జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






