మంథని పట్టణ అభివృధ్ధికి నిరంతరం పనిచేయాలి
మంథని మున్సిపల్ సాధారణ సమావేశంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు
మంథని, మార్చి13(విజయక్రాంతి): మంథని పట్టణ అభివృధ్ధికి మున్సిపల్ పాలకవర్గం నిరంతరం పనిచేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.మంథని మున్సిపాల్ కార్యాలయం లో నూతనముగా ఎన్నికైన పాలక వర్గ సభ్యుల మొదటి సాధారణ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ వో డ్నాల శ్రీనివాస్ అద్యక్షతన, మున్సిపల్ కమిషనర్ మనోహర్ నిర్వహించిన సాధారణ సమావేశములో పాలక వర్గ సభ్యులకు మంథని పట్టణ అభివృద్ధి పనుల గురించి మంత్రి శ్రీధర్ బాబు దిశ - నిర్దేశ్యము చేశారు.వార్డుల వారిగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని వారి సలహాలు సూచనలతో ప్రణాళిక తయారు చేసి వార్డులలో సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. మంథని పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనీ తెలిపారు.
ఈ కార్యక్రమములో అవసరమైన ముఖ్య అంశాలు పారిశుధ్య, త్రాగునీటి, వీధి దీపాలు, మొక్కలు పెంపకం, చలివేంద్రాలు ఏ ర్పాటు మొదలగు వివిధ అంశాల మీద చర్చించి ఆమోదించారు.తదుపరి మెప్మా విభాగములో ఎస్ హెచ్ జీఎస్ మెంబర్స్ స్వయంగా పనికి రాని వస్తువులతో తాయారు చేసిన సృజనాత్మక వస్తువులను పరిశీలించారు.ఈ కార్యక్రమములో వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, పాలక వర్గ సభ్యులు కుర్ర లింగయ్య, నూకల కమల్, మాచీడి రాజు గౌడ్, స్రవంతి మద్దికట్ల, పోతరబోయిన శ్రీలత, జంబోజు శ్రీమతి, మారుపాక నిహారిక, వేముల లక్ష్మి, యేల్లంకి వంశీధర్, మున్సి పల్ సిబ్బంది, మెప్మా ఆర్.పి లు తదితరులుపాల్గొన్నారు.




