తల్లిదయ ప్రజలపైన ఉండాలి
- మూడు రోజులుగా ఏడుపాయల వరకు పాదయాత్ర
19వ వార్డు కౌన్సిలర్ నవీన్ రెడ్డి
పటాన్ చెరు, మార్చి 13 :పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పాశమైలారం 19, 20 వార్డులలో బిఆర్‌ఎస్ పార్టీ గెలిచినందున బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పాశమైలారం నుండి ఏడుపాయల వనదుర్గమాత ఆలయం వరకు పాదయా త్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నవీన్ రెడ్డి హాజరయ్యారు. పాదయాత్ర నిర్వహించిన ముగింపు రోజు విందు భోజనం నిర్వహించారు.
ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఆ తల్లి కృప 19, 20 వార్డు ప్రజల మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకున్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు ముదిరాజ్, అనిల్ యాదవ్, వెంకటేష్, లక్ష్మారెడ్డి నరసింహ, చారి, కిరణ్, శివకుమార్, రాజు, అనిల్ ముదిరాజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.




