1 September, 2026 | 1:58 AM

అత్యాధునిక సెంట్రలైజ్‌డ్ కిచెన్

01-09-2026 01:18 AM

మంచిర్యాలలో ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు

మంచిర్యాల, ఆగస్టు31 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహార బ్రేక్‌ఫాస్ట్ అందించేందుకు మంచిర్యాల మెడికల్ గొడౌన్‌లో హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా (హెచ్‌కేఎంసీఎఫ్ ఇండియా) ఆధ్వర్యంలో నిర్మించి న అత్యాధునిక సెంట్రలైజ్‌డ్ కమ్యూనిటీకి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు సోమవారం ప్రారంభించారు.

పిల్లల పోషకాహారం, అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి ష్ఠాత్మక తెలంగాణ స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రా మ్’ అమలులో హెచ్‌కేఎంసీఎఫ్ ఇండియా కీలక భాగస్వామిగాఉంది.

ఈ కార్యక్రమం ద్వారా మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, జన్నారం, మందమర్రి, లక్సెట్టిపేట, దండేపల్లి, కాశీపేట, నెన్నెల, హాజీపూర్, నస్పూర్, భీమారం, జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్, ఎండపల్లి, పెద్దపల్లి జిల్లాలోని పె ద్దపల్లి, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని 691 ప్రభుత్వ పాఠశాలలు, 13 జూనియర్ కళాశాలలకు చెందిన సుమా రు 49,109 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు మం చిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఇండియా (హెచ్‌కేఎంసీఎఫ్ ఇండియా) ప్రెసిడెంట్, అక్షయ పాత్ర ఫౌండేషన్ (తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్) రీజినల్ ప్రెసిడెం ట్ సత్య గౌర చంద్ర దాస స్వామీజీ, అతిథులుగా మంచిర్యాల మేయర్ ధరణిమధుకర్, డిప్యూటీ మేయర్ రమ్య సల్ల, కార్పొరేటర్ జ్యోతి చిలువేరు, అగ్రికల్చర్ మార్కెట్ కమి టీ చైర్‌పర్సన్ రామగిరి బానేష్, ప్రత్యేకా ఆహ్వానితులుగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) అండ్ డీఈవో(ఎఫ్‌ఏసీ) పి.చంద్రయ్య, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్) సూపరింటెండెంట్ అశోక్‌కుమార్, ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్) జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, ఏ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొనగా హెచ్‌కేఎంసీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ కౌంతేయదాస స్వామీజీ అధ్యక్షత వహించారు.