పోలీస్, హోంగార్డుల సేవలు ఎనలేనివి
- బాధ్యతాయుతంగా విధుల నిర్వహణ
- పోలీస్ కమిషనర్ సునీల్‌దత్
- ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు సత్కరించిన సీపీ
ఖమ్మం, ఆగస్టు 31 (విజయక్రాంతి): ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూల మాలలు,శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాల్లో భాద్యతయుతమైన విధులు నిర్వహిం చి పోలీస్ శాఖకు ఎనలేని సేవలందించారని కొనియాడారు.
విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. ఉద్యోగ విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అన ందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాం క్షించారు. ఎస్‌ఐలు వి సుధాకర్‌రెడ్డి, కె రా యప్ప, వి రామారావు, ఏఎస్‌ఐలు ఎం శ్రీనివాసరావు,
ఎండీ అబ్దుల్ రహెమాన్, హెచ్ సీలు ఎస్‌కే అహ్మద్, కె సత్యం, ఏఆర్‌ఎస్‌ఐ బి సుందర్‌రావు, హోంగార్డ్ ఆర్ వెంకటేశ్వ ర్లు ఉద్యోగ విరమణ పొందిన వారిలో ఉ న్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రా మానుజం, ఆర్‌ఐలు కామరాజు, సురేష్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు హేమనా థ్, హోంగార్డు సంక్షేమ సంఘం అధ్యక్షులు బంక శ్రీను, జాతీయ ఉపాధ్యక్షులు ఇ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.






