2 June, 2026 | 2:26 AM

ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు

03-06-2026 12:00 AM

వినికిడి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం

సదరం సర్టిఫికెట్‌ల జారీకి సరళతరం

ఖమ్మం టౌన్, జూన్ 1 (విజయక్రాంతి): ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లోని ఈ ఎన్ టి విభాగానికి అత్యాధునిక బిఈఆర్‌ఏ, ఆడియో మీటర్ పరికరాలు సోమవారం నుండి అందుబాటులో కి వచ్చాయి. ఈ పరికరాలను ముఖ్యంగా సదరం శిబిరాల నిర్వహణలోను, వినికిడి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వినికిడి లోపాలు, చెవులకు సంబంధించిన వైకల్యాలను ఖచ్చితంగా నిర్ధారించడానికి ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడనున్నవి.

ఈ పరికరాలు ద్వారా వికలాంగుల అంచనా, ధృవీకరణ, పునరావాస సేవలు మరింత సమర్థవంతంగా అందించబడతాయి. ఈ ఆధునిక పరికరాల ద్వారా చిన్నారులు, పెద్దలకు సమగ్ర వినికిడి పరీక్షలు నిర్వహించి, సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం లభిస్తుంది. సదరం శిబిరాలకు హాజరయ్యే లబ్ధిదారులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయి. 

ప్రారంభించిన సూపరింటెండెంట్

ఈ పరికరాలను సోమవారం మెడికల్ సూపరింటెండెంట్ డా. ఎం. నరేందర్, వైస్ ప్రిన్సిపల్ డా. ఎస్. రాజేశ్వరరావు స్థానిక ప్రభుత్వ అస్పత్రిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డా. ఎం. నరేందర్ మాట్లాడుతూ ఇటువంటి అత్యాధునిక పరికరాలను ప్రారంభించటం సంతోశ కరమణి, రోగులకు మంచి సేవలు అందించాలని వైద్యులకు సూసించారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డా. బి. కిరణ్ కుమార్, ఆర్థోపెడిక్ సర్జరీ హెచ్ ఓ డి డా. ఎల్. కిరణ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. సంతోష్, డా. సౌజన్య, బయోమెడికల్ ఇంజనీర్ ఇస్లావత్ రెడ్డి, అస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.