2 June, 2026 | 1:25 AM

ఇసుక దందాలో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా..

02-06-2026 12:54 AM

రాష్ట్ర సంక్షేమశాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ధర్మారం, జూన్ 1 (విజయ క్రాంతి): ఇసుక దందాలో తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో కురిసిన ఆకాల వర్షాలకు జరిగిన నష్టాన్ని సోమవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై ఏలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వకాలంలో జోరుగా ఇసుక దందాసాగిందని, బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరేళ్ల గ్రామం నుంచి మానేరు ఇసుకను రోజు వందల లారీల్లో రవాణ చేసే వారని అన్నారు. అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న క్రమంలో పలువురు లారీల కింద పడి మరణించారని గుర్తు చేశారు. నేరేళ్ల దళితులు అక్రమ ఇసుక రవాణపై అందోళన చేస్తే నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులపై థర్డ డిగ్రీ ఉపయోగించిందని అన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో దళితులపై జరిగిన దాడులపై మాట్లాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గంలో ఇసుక దందాలో తనకు వాట ఉందని మాట్లాడుతున్నారని అన్నారు. ఇసుక దందాలో తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్దమని అన్నారు.

మాజీ మంత్రి కొప్పుల నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మంత్రి అడ్లూరి హితవు పిలికారు. ధర్మరం మండలంలో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యం, మక్కజోన్నలు కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులు ఎవ్వరు అందోళన చెందవద్దని మంత్రి కోరారు. ఆకాల వర్షానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ పరంగా అదుకుంటామని మంత్రి అడ్లూరి తెలిపారు.