28 June, 2026 | 12:12 PM

Breaking News

రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •  

రాజ్యాధికారమే బీసీలకు లక్ష్యం కావాలి

22-02-2026 12:00 AM

‘మాస్’ వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగ్ రావు

ఎల్బీనగర్, ఫిబ్రవరి 21 : బీసీలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని, రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాడాలని మన ఆలోచన సాధన సమితి (మాస్) వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగ్ రావు పిలుపునిచ్చారు. నాగోల్లోని మన ఆలోచన సాధన సమితి (మాస్) ప్రధాన కార్యాలయంలో శనివారం పద్మశాలి, కుమ్మరి కులాల ప్రతినిధులకు నాయకత్వ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ’మాస్’ ప్రధాన కార్యదర్శి గుణగంటి చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా ’మాస్’ వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగ్ రావు మాట్లాడుతూ.. బీసీలు అనుచరులుగా కాకుండా నాయకులుగా ఎదగాల్సిన సమయం వచ్చిందన్నారు. బీసీల్లో నాయకత్వ లక్షణాలు పెం పొందించుకోవాలని, వారిని సమర్థ నాయకులుగా తీర్చిదిద్దడమే మాస్ లక్ష్యమని స్పష్టం చేశారు.

బీసీలకు రావాల్సిన అవకాశాలు,  ఇతరుల చేతికి వెళ్లకుండా ఉండాలం టే విద్య, వైద్య, సామాజిక చైతన్యాన్ని ఆయుధంగా మలుచుకుని ముందు కు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఆవుల వెంకట్ యాదవ్, నిమ్మల సత్యం, మంగలి పెళ్లి శంకర్, పెద్దవూర బ్రహ్మయ్య, భరద్వాజ్, శ్రీకాంత్, ము నగాల మురళీకృష్ణ చారి, నర్సింగ్, గుండ్ల ఆంజనేయులుగౌడ్, నక్క మహేష్ యాదవ్, డేరంగుల కృష్ణ, జక్కుల బాలరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.