19 May, 2026 | 5:55 AM

న్యూజిలాండ్ మీట్ అండ్ గ్రీట్‌లో రాష్ట్ర ప్రతినిధులు

10-11-2024 12:07 AM

హైదరాబాద్, నవంబర్ 9 (విజయ క్రాంతి): న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆక్లాండ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి అసోసియేషన్ ప్రతినిధులు రాంమోహన్, కల్యాణ్ రావు  సన్మానించారు. వారి వెంట  శాస నసభ సెక్రటరీ వీ నరసింహాచార్యులు ఉన్నారు.