calender_icon.png 4 June, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు..

02-06-2025 08:09:48 PM

హుజూరాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ అవతరణ వేడుకలు(Telangana State Formation Day) బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర అవతరణ అని అన్నారు.

తెలంగాణ మలి దశ ఉద్యమం నుంచి రాష్ట్ర సాధన వరకు ప్రాణత్యాగాలు చేసిన వీరులను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. స్వేచ్ఛ కోసం ప్రాణ త్యాగం చేసిన వీరుల త్యాగ ఫలితంగా, కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ ఈ రోజు అవతరించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గందె రాధిక, మాజీ కౌన్సిలర్లు తాళ్లపెల్లి శ్రీనివాస్, కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు రాజ్ కుమార్, అనిల్, దిల్ శ్రీనివాస్, మార్కండేయ, డిష్ రమేష్, సోషల్మీడియా కన్వీనర్ తులసీ లక్ష్మణమూర్తి, తో పాటు తదితరులు పాల్గొన్నారు.