20 August, 2026 | 6:41 PM

కొత్తగూడెం సైబర్ క్రైమ్ టీంకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు

20-08-2026 05:23 PM

కొత్తగూడెం ఆగస్టు 20:  మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్  ఆధ్వర్యంలోని ఎంఆర్ఎమ్, జిఆర్ఎమ్, సమన్వయ, సహాయోగ్ వంటి ఆధునిక పోర్టల్స్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ, ఉత్తమ పనితీరు కనబరిచిన తెలంగాణ పోలీస్ యూనిట్లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. ఎంహెచ్ఏ పోర్టల్స్‌లో నమోదైన పనితీరు ఆధారంగా ప్రకటించిన ఉత్తమ ప్రదర్శన జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమన్వయ కేటగిరీలో మొదటి స్థానాన్ని సాధించింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉత్తమ ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సైబర్ నేర నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ, బాధితులకు వేగవంతమైన సేవలు అందించాలని, సైబర్ నేరాలపై యువతలో అవగాహన పెంపొందించేందుకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్పార్క్ క్లబ్ ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రియదర్శిని డిగ్రీ కళాశాల, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటిపి మోసాలు, సోషల్ మీడియా మోసాలు, డిజిటల్ అరెస్టులు తదితర సైబర్ నేరాలపై కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెల్ సీఐ జితేందర్, ఎస్సై జుబేదా బేగం, సైబర్ సెల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.