calender_icon.png 25 October, 2025 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్టోబర్ 30న రాష్ట్రవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయండి

25-10-2025 03:21:01 PM

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్

మంథని,(విజయక్రాంతి): అక్టోబర్ 30న రాష్ట్రవ్యాప్త  బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ పిలుపునిచ్చారు. మంథని లోని ప్రజాసంఘాల కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశంలో మండలాధ్యక్షుడు బందెల రాజకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోకుండా విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుందని, గతంలో పెండింగ్స్ స్కాలర్షిప్ విడుదల చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా విడుదల చేయకులేదు.

విద్యార్థులు ఉన్నత చదువు చదువుకోలేకపోతున్నారని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని, ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఫీజులను డిమాండ్ చేసి వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ ఆల్ ప్రొఫెషనల్, డిగ్రీ, పీజీ, విద్యాసంస్థల యూనివర్సిటీల రాష్ట్ర వ్యాప్త బంద్ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి తేజ, శ్రావణ్, పునీత్, శ్రీశాంత్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.