calender_icon.png 25 October, 2025 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐడియాథాన్ ఫైనల్స్ లో పాల్గొంటున్న గీతం జట్లు

25-10-2025 03:17:14 PM

పటాన్ చెరు: హైదరాబాదులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీహెచ్)లో నిర్వహిస్తున్న యూత్ స్పీక్: ఐడియాథాన్ 2025 ఫైనల్స్ లో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదుకు చెందిన 13 జట్లు పాల్గొంటున్నాయి. ఏఐఈఎస్ఈసీ (ఆచరణాత్మక అనుభవాల ద్వారా యువత తమ నాయకత్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక ప్రపంచ వేదిక) సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఈఈసీఈ విభాగం, జీ-ఎలక్ట్రా ప్రాథమిక ఎంపికను విజయవంతంగా పూర్తిచేశాయి.

యువ ఆవిష్కర్తలకు ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్డీజీస్) పరిష్కరించే కార్యాచరణ పరిష్కారాలను ప్రతిపాదించడానికి దీనిని సంకల్పించారు. ఐఐటీహెచ్ లో జరిగే ఫైనల్స్ లో హ్యాకథాన్, నిపుణుల కార్యశాల, ప్యానెల్ చర్చలు, విలువైన నెట్ వర్కింగ్ అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు పరిశ్రమకు సంబంధించిన అనుభవాన్ని పొందడానికి, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించు కోవడానికి, ప్రపంచ వేదికపై గుర్తింపు పొందేందుకు ఇది తోడ్పడనుంది. గీతంలో జరిగిన ప్రాథమిక రౌండ్ పోటీలలో పలు విభాగాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, వారి సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం, స్థిరమైన అభివృద్ధి పట్ల నిబద్ధతను ప్రదర్శించారు.