09-01-2026 12:00:00 AM
గాంధీనగర్ కార్పొరేటర్ ఏ పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రక్క వీధి లో గత 15 ఏళ్లుగా రోడ్డుకు అడ్డంగా ప్రమాధకరంగా వున్న కరెంట్ స్థంబాలను తొలగిం చారు. స్థానికులు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ చేసి న ఫిర్యాదు మేరకు టీజీఎస్పీడీసీఎల్ అధికారులతో సమీక్షించి ప్రమాదకరంగా ఉన్న 5 కరెంట్ స్థంబాలను తొలగించి మరో చోట ఏర్పాటు చేయాలని సూచించారు.
గురువారం సిబ్బంది స్థంబాలను తొలగించి మరో చోట ఏర్పాటు చేసిన పనులను కార్పొరేటర్, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, సీబీడీ ఎఈ నర్సింగ్ రావు, గాంధీనగర్ ఎఈ సంతోష్, స్థానికులు, బీజేపీ నాయకులతో కలసి పర్యవేక్షించారు. 15 ఏళ్ల సమస్యను పరిష్కరించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశా రు. బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వీ. నవీన్ కుమార్, సీనియర్ నాయకు లు రత్న సాయి చంద్, శ్రీకాంత్, ఆనంద్ రావు, నీరజ్, జ్ఞానేశ్వర్ స్థానికులు సాల్మన్ రాజు, శివకుమార్, ప్రకాష్ రెడ్డి, పౌల్, సువర్ణ పాల్గొన్నారు.