15 April, 2026 | 11:56 AM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

అంబేద్కర్ విగ్రహం ఏమాయె..

27-05-2025 08:03 PM

లారీ ఢీకొని విగ్రహం ధ్వంసం..

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి మండలం(Peddapalli Mandal)లోని పెద్దబోంకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం గత రెండు రోజులుగా కనిపించడం లేదు. నిత్యం లారీలు అధిక లోడ్ తో పాటు వేగంతో ప్రయాణిస్తుండటంతో అంబేద్కర్ విగ్రహం గద్దెకు ఢీకోని విగ్రహం ధ్వంసం అయినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇంత తతంగం జరిగిన కూడా ఈ  విషయం బయటకి రాకుండా, ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత సంఘం సభ్యులు, అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం లేకపోవడంతో గ్రామానికి ఉన్న కళా తప్పిందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంఘం నాయకులు స్పందించి అంబేద్కర్ విగ్రహం వెంటనే ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.