14 July, 2026 | 6:57 PM

Breaking News

విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •  

‘కంచ’ భూముల తాకట్టు నిబంధనలకు విరుద్ధం

27-06-2025 12:00 AM

‘సెబీ’కి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ

హైదరాబాద్, జూన్ 26(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి.. రాష్ట్రప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా రూ.10 వేల కోట్ల మేర రుణం తీసుకున్నదని, అది నిబంధనలకు విరుద్ధమని మాజీ మంత్రి హారీశ్‌రావు ఆరోపించారు. గురువారం ఈ మేరకు ఆయన సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండి యా (సెబీ)కి లేఖ రాశారు.

సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఇప్పటికే కంచ గచ్చిబౌలి భూములపై అధ్యయనం చేసి, సదరు భూముల అటవీశాఖ పరిధిలోని భూములని గుర్తించిందని గుర్తుచేశారు. వాస్తవాలను దాచి పెట్టి, టీజీఐఐసీ ద్వారా భూములు తాకట్టు పెట్టి రుణా లు సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొ న్నారు. టీజీఐఐసీ వార్షిక ఆదా యం రూ.150 కోట్ల కన్నా తక్కువే ఉంటుందని, ఆ మాత్రం ఆదాయానికే వేల కోట్ల అప్పులు తీసుకోవడం దేనికి సందేశమని ప్రశ్నించారు.

ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని, రుణం సాధించేందుకు మధ్యవర్తులకు రూ.169.83 కోట్లమేర తాయిలం ఇచ్చిందని ఆరోపించా రు. రాష్ట్ర అటవీ సంపదను తాకట్టు పెట్టి, తప్పుడు పత్రాలు సృష్టించి, వ్యవస్థలను మోసం చేసి, అడ్డదారుల్లో రుణాలు సేకరించిన వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, ఆర్థిక అవకతవకలను బయటపెట్టాలని సెబీకి విజ్ఞప్తి చేశారు.