12-02-2026 12:39:44 AM
కరాటే చాంపియన్‌షిప్ పోటీలో ట్రోఫీ గెలిచిన స్కూల్ విద్యార్థులు
ఖమ్మం, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ఖమ్మం శ్రీనగర్ కాలనీలో గల స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్ విద్యార్థులు ఆసియా ఇం టర్నేషనల్ డబ్ల్యూఫ్‌ఎస్‌కేఓ ఓపెన్ కరాటే చాంపియన్ షిప్-2026 పోటీలలో అండర్-14 కుమిటే బాలుర విభాగంలో ఎస్‌కె అద్నాన్ బంగారు పతకం, కటా విభాగంలో సిల్వర్ పతకాలు సాధించారు. అండర్-12 కుమిటే బాలికల విభాగంలో రెడ్డిబోయిన సోనాక్షి సిల్వర్ పతాకాన్ని, కటా విభాగంలో బాంజ్ పతకం సాధించారు.
ఏప్రిల్ 26న దుబాయ్‌లో జరగబోయే ఇంటర్నేషల్ ఛాం పియన్షిప్ ట్రోఫీకి అర్హత సాధించారు. పాఠశాల డైరెక్టర్స్ కె.శ్రీధర్‌రావు, కష్ణవేణి విద్యా ర్థులను అభినందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పి.వి. ఆర్.మురళీమోహన్, కోచ్ ఎస్.కె.ఖాసీమ్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.