9 August, 2026 | 2:06 AM

అలుగుడు మాని అడుగులు వేసే..

09-08-2026 12:59 AM

ఆకట్టుకునే ట్రైలర్, సాంగ్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ‘పళ్ళబురుసు’ టీమ్, ఇప్పుడు ‘హైలో హైలో హైలెస్సా..’ అనే ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేసింది. సంప్రదాయ జానపద శైలికి మోడరన్ బీట్లను జోడిస్తూ ఆకట్టుకుంటోందీ పాట ‘అలుగుడు మాని అడుగులు వేసే పరుగులు తీసే జోరుగా.. గులుగుడు మాని గెంతులు వేసే గడబిడ చేసే గోలగా.. కోయిలా కోయిలా కోయిలాలా.. ఆపినా ఆగని పయనాల.. ఎన్నియాల మల్లియాలా.. హైలో హైలో హైలెస్సా పిల్లని పల్లకి ఎక్కిస్తా...’ అంటూ సాగుతోంది. పవన్ సీహెచ్ స్వరపరిచిన ఈ పాటకు సురేశ్ గంగుల సాహిత్యం అందించగా, శ్రీరామచంద్ర, లక్ష్మీ మేఘన పాడారు. ఈ పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలు. పవన్ సీహెచ్ సంగీతం అందిస్తుండగా, వినోద్ కే బంగారి సినిమాటోగ్రఫీ, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానుంది.