9 August, 2026 | 2:09 AM

సగటు మనిషి జీవితమే శివ గాడి జిందగీ

09-08-2026 01:02 AM

ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం ‘శివ గాడి జిందగీ’. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని దేవరకొండ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వినయ్‌రెడ్డి చందుపట్ల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను నిర్మాత సురేశ్‌బాబు లాంచ్ చేశారు. సాంగ్‌ను అతిథులుగా పాల్గొన్న రీల్‌ఆన్ సీఈవో దాశరథం బిట్ల, రాయల్ ఎన్‌ఫీల్ డీలర్ ప్రిన్సిపల్ పూల సందీప్‌కుమార్ నాయుడు విడుదల చేశారు.

కామెడీ, ఎమోషన్, డ్రామా, ఫ్రెండ్‌షిప్, లవ్ వంటి అన్ని రకాల వినోద అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఒక సామాన్య మనిషి తన జీవితంలో ఎదుర్కొన్న రకరకాల పరిస్థితులు, సంఘటనలు, భావోద్వేగాల సమాహారంగా ఈ చిత్రం సాగనుంది. ప్రతీ సన్నివేశానికి ఒక బలమైన కారణం, ప్రతీ పాత్రకు ఒక ప్రాధాన్యత, ప్రతీ ఎమోషన్‌కు ఒక అనుబంధం ఉండేలా దర్శకుడు ఈ కథను మలచడం విశేషం.

సాంగ్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు వినయ్‌రెడ్డి చందుపట్ల మాట్లాడుతూ.. “శివ గాడి జిందగీ’ అనేది సమాజంలోని ప్రతి సగటు మనిషి జీవితానికి ఒక చక్కటి ప్రతిరూపం. ప్రతి ఒక్కరినీ ఈ కథ ఆకట్టుకుంటుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటుడు వివరెడ్డి, నిర్మాత సింధు సూర్య చిత్రబృందం పాల్గొన్నారు. ఈ చిత్రానికి సాయి సంగీతాన్ని, జేపీ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.