17 April, 2026 | 9:32 PM

Breaking News

జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •  

ఏజెన్సీలోని గిరిజనులకు గుర్తింపు కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలి

12-06-2025 12:34 AM

భద్రాచలం, జూన్ 11 (విజయ క్రాంతి): ఏజెన్సీ ఏరియా పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలలోని సభ్యులకు ధర్తీ అభ, జాతీయ గ్రామీణ ఉత్కర్ష అభియాన్, పీఎం జన్మన్ పథకం కింద కుటుంబంలోని ప్రతి సభ్యులకు వివిధ రకాల గుర్తింపు కార్డులు అందేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మోట డిప్యూటీ సెక్రటరీ గణేష్ నాగరాజన్ సంబంధిత అధికారులకు సూచించారు.

బుధవారం నాడు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మోట కార్యాలయం హైదరాబాదు నుండి తెలంగాణ రాష్ట్రంలోని డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు మరియు డిటిడిఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిరిజన గ్రామాలలో చేపట్టవలసిన కార్యాచరణపై ఆయన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజన గూడెంలలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు ఈ నెల 15 నుండి 30 వరకు గ్రామ పంచాయతీల వారీగా గ్రామసభలు నిర్వహించి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కేవైసీ కార్డు, బ్యాంకు ఖాతా, పిఎం కిసాన్ కార్డు, ప్రభుత్వ పథకాలు వారికి అందించడానికి అవసరమైన ప్రతి కార్డు కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సంబంధిత అధికారులు వారిని గుర్తించి త్వరితగతిన అందించే విధంగా చూడాలని, ప్రతి అంశం సంబంధిత ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులకు తెలియజేసి ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు.

పి వి టి జి గ్రామాలలో ముఖ్యంగా త్రాగునీరు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, గిరిజన బడి ఈడు పిల్లలు అందర్నీ పాఠశాలలో, అంగనవాడి సెంటర్లలో చేర్పించే విధంగా చూడాలని అన్నారు.