17 April, 2026 | 11:07 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రోటావేటర్ కిందపడి చిన్నారి మృతి

12-06-2025 12:33 AM

చేవెళ్ల , జూన్ 11 : మామిడి తోటలో గడ్డిని తొలగింస్తుండగా ట్రాక్టర్ రోటావేటర్ కింద పడి చిన్నారి మృతి చెందిన ఘటన చేవెళ్ల మండల పరిధి తంగడిపల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. చేవెళ్ల ఎస్‌ఐ శిరీష తెలిపిన కథనం ప్రకారం.. వికారాబాద్ మున్సిపల్ పరిధి రాజీవ్ కాలనీకి చెందిన మంగళి సంజీవ్ కుమార్ (34) బార్బర్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.

మంగళవారం సంజీవ్ కుమార్ భార్య అక్క అయిన పద్మ నివాసముంటున్న చేవెళ్ల మండల పరిధి తంగడిపల్లి గ్రామానికి కుటుంబ సభ్యులతో వెళ్లారు. బుధవారం ఉదయ 9 గంటల సమయంలో పద్మ వాళ్ల ఫాంహౌస్లోని మామిడి తోటలో భర్త సుశీల్ కుమార్ ట్రాక్టర్ రోటావేటర్తో గడ్డిని తొలగిస్తుండగా అక్కడే ఆడుకుంటున్న సంజీవ్ కుమార్ కూతురు అక్షిత (11) ప్రమాదవశాత్తు రోటావేటర్లో ఇరుక్కుపోయింది.

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చేవెళ్లలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి సంజీవ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుఎస్‌ఐతెలిపారు.