ప్రాణాలతో చెలగాటం
- అనుమతి ఒకరిది.. నిర్వహణ మరొకరిది
- అద్దె సర్టిఫికెట్లతో మందుల దందా
- డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణ కరువు
మంచిర్యాల, ఆగస్టు 26 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో సుమారు 500లకుపైగా మందుల దుకాణాలు కొనసాగుతు న్నాయి. వీటిలో చాలావరకు ఫార్మాసిస్టులు లేకుండానే మందుల అమ్మకాలు జరుపుతున్నారు. ప్రజలు మెడికల్ షాపునకు వెళ్లి జ బ్బుల పేరు చెబితే ఇంటర్మీయెట్ కూడా చ దవని వారు కూడా మందులు ఇస్తున్నారు. దీంతో ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ఇలా ప్రజలు నేరుగా కొనుగోలు చేస్తుండటంతో మెడికల్ షాపులు జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.
ఫార్మసిస్టు లేకుండానే నిర్వహణ
దుకాణంలో ఫార్మాసిస్టు లేకుండానే అమ్మకాలు జరుపుతున్నారు. అడ్డదారిన అ నుమతులు పొందుతూ దందాను సాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోనైతే ఆర్‌ఎంపీ, పీఎంపీలు తమ ప్రాథమిక కేంద్రానికి పక్కనే వేరే వారి పేరిట మెడికల్ షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. జ్వరం, జలుబు, తలనొప్పి ఇలా ఏదైనా ప్రజలు నేరుగా మెడికల్ షాపునకు వెళితే డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకు ండానే మందులు అందజేస్తున్నారు. యాం టీబయాటిక్స్‌తోపాటు రెండు, మూడు రకా ల ట్యాబ్లెట్లు ఇచ్చి క్యాష్ చేసుకుంటున్నారు.
అద్దెకు సర్టిఫికెట్లు
జిల్లాలో అద్దె సర్టిఫికెట్లతో షాపులు నిర్వహిస్తున్నారు. సర్టిఫికెట్‌ను ఏడాదికి రూ. 20 వేల నుంచి రూ. 25 వేలు చెల్లించి అద్దెకు తీసుకొని దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.ఎలాంటి అనుభవం లేని వారు షాపులు నడుపుతున్నారు. ఇలా జిల్లాలో 60 శాతానికిపైగా మెడికల్ షాపులను ఏండ్ల తరబడిగా కొనసాగిస్తున్నారు. ఈ విషయం సంబంధిత శాఖ అధికారులకు తెలిసే జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి.
అనుమతి ఒకరిది.. నిర్వహణ మరొకరిది
మెడికల్ షాప్ పర్మిషన్‌ను ఒకరి పేరు మీద తీసుకుని, మరొకరు నడుపుతున్నారు. వీరికి కనీసం మందులపై అవగాహన ఉండడం లేదు. షాపునకు వెళ్లి జబ్బు పేరు చెప్పగానే డోస్‌తో సంబంధం లేకుండా తమకు తెలిసిన మందులను అంటగడుతున్నారు. దీంతోనయం కాకపోగా కొత్త జబ్బులకు కారణమవుతున్నారు.
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణ కరువు
మెడికల్ దుకాణాలను తనిఖీ చేసే డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేయడం లేదు. దీంతో మందులకు కనీసం బిల్లులు కూడా ఇవ్వలేదు. ఇంత పెద్ద మొత్తంలో దందా జరుగు తున్నా అధికారులు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం.
చర్యలు తీసుకుంటాం..
జిల్లాలో మెడికల్ దుకాణాలను ప ర్యవేక్షిస్తున్నాం. ఫార్మసిస్టు ఖచ్చితంగా దుకాణంలో ఉండాలి. ఫార్మసిస్టు కాకు ండా ఇతరులు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే చర్యలు తీసుకుంటాం. ఆ దుకాణం లైసెన్సు రద్దు చేస్తాం.
చందన, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, మంచిర్యాల






