28-06-2025 12:00:00 AM
- కలెక్టర్ సీరియస్, చర్యలు తప్పవని హెచ్చరిక
కరీంనగర్, జూన్ 27 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా మారింది. నిషేధిత సర్వే నెంబర్లలో రిజిస్ట్రేషన్లు చేయడంతోపాటు కొన్ని సర్వే నెంబ ర్లలో ఇంటి నెంబర్లతో రిజిస్ట్రేషన్ల దందా కొనసాగుతుంది.
కొన్ని సర్వే నెంబర్లపై హై కోర్టు ఆదేశించిన వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధిత జాబితాలోని సర్వే నెంబర్ల ను దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేస్తున్న సంఘటనలు అనేకం ఇప్పటికే వెలుగులోకి వచ్చా యి. రేకుర్తిలోని సర్వే నెం. 79/2లోని 10 గుంటల స్థలాన్ని తాండ్ర శంకర్ బాబుకు భూ యజమానులు రిజిస్ట్రేషన్ చేసేందుకు హైకోర్టు అనుమతిచ్చిన దాన్ని పక్కన పెట్ట డం వివాదానికి దారితీసింది.
ప్రస్తుతం గం గాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ కింద పనిచేసే వారు చెప్పిందే వేదంగా నడుస్తుండడంవల్ల పలువురు ఇ బ్బందులు పడుతున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా లక్షలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవల కొత్తపల్లి పరిధిలోని సీలింగ్ భూముల విష యంలో లోకాయుక్త ఆదేశం మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 400కుపైగా రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు.
రేకుర్తిలో కూడా 2001, 2002, 2003 సర్వే నెంబర్లలో సీలింగ్ భూమి లేదా కొత్తపల్లికో న్యాయం, ఇక్కడికో న్యాయమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేకుర్తి భూ ముల విషయంలో 1997లో అప్పటి కలెక్టర్ బీఆర్ మీనన్ సర్వే చేయించి రికార్డును ప్రభుత్వానికి సమర్పించారు. బీఆర్ మీనన్ నివేదిక అనంతరం ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధం కాగా కొందరు హైకోర్టును ఆశ్రయించడం, అప్పటి నుండే ఈ రిజిస్ట్రేషన్ల దందా కొనసాగుతుండడంతో చాలామంది బాధితులు కోర్టును ఆశ్రయిస్తూ లక్షలు వెచ్చించి భూములు కొనుగోలు చేసి రోడ్డున పడుతున్నారు.
దళారుల రాజ్యమే కొనసాగు తున్నది. తాజా పరిణామాల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ జిల్లా పరిధిలోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ అధికారులకు ఎల్ఆర్ నెం. డీ1/1033/2025 ద్వారా కఠిన చర్యలు తప్పవని ఆదేశించారు. 2022లో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ రావడంతో ఈ మేరకు కలెక్టర్ ఆదేశించారు.
కరీంనగర్ చుట్టుపక్కన గ్రామాలు నగరపాలక సంస్థలో విలీనమైనప్పటికీ కరీంనగర్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుండడం కూడా అక్రమా ర్కులకు అడ్డాగా మారింది. కరీంనగర్ రూర ల్ పరిధిలో శివారు గ్రామాలను కలుపుకుని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వస్తున్నది.
- అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు
నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లలో గల భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాధ్యులైన అధికారులపై కేసులు నమోదు చేయిస్తాం. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మాత్రమే రిజిస్ట్రేషన్ జరపాలి. కలెక్టర్ కార్యాలయం నుంచి పంపించిన ప్రతి నిషేధిత జాబితా సర్వే నెంబర్లను క్రోడీకరించి సమగ్ర జాబితా సిద్ధం చేసుకోవాలి. ఉన్న స్థలం కంటే ఎక్కువగా రిజిస్ట్రేషన్లు చేయడం, తప్పుడు ధృవీకరణ పత్రాలు పరిశీలంచకుండా రిజిస్ట్రేషన్ చేస్తేచర్యలుతప్పవు.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి