calender_icon.png 15 July, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు అమ్మితే చర్యలు తప్పవు: ఎంఈఓ భాస్కర్ రెడ్డి

27-06-2025 11:42:21 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను విక్రయించిన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పల్లవి అనే ప్రైవేటు పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలను అమ్ముతున్నట్లు ఫిర్యాదు అందడంతో ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు పాఠ్యపుస్తకాలను ఆయన సీజ్ చేశారు. ప్రైవేటు పాఠశాలలు నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందేనని లేదంటే పాఠశాల సీజ్ చేస్తామని హెచ్చరించారు. బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ యూనియన్ లీడర్ రామకృష్ణ అధిక ఫీజులు వస్తువులు చేస్తూ పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.