24 August, 2026 | 10:23 PM

Breaking News

8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •  

చెంచు కుటుంబాలను గుర్తించండి

27-06-2025 11:44 PM

ప్రభుత్వ పథకాలను అందించాలని ఎంపీఓకు బీజేపీ నాయకులు రఘురాం గౌడ్ వినతి

హన్వాడ: చెంచు కుటుంబాలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను వారి దరి చేర్చి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని బిజెపి నాయకులు రఘురాం గౌడ్ అన్నారు. శుక్రవారం ఎంపీవో జగదీష్ కుమార్ కు ఎంపీడీవో కార్యాలయంలో పెద్ద ధర్పల్లి గ్రామంలో 8 చెంచు కుటుంబాలు ఉన్నాయని కేవలం ఒకే కుటుంబం ఉన్నట్లు గుర్తించడం జరిగిందని,  మిగతా వారిని కూడా గుర్తించి అవసరమైన సదుపాయాలను కల్పించాలని కోరారు. చెంచు కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయని వారి అవసరాలను గుర్తించి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని కోరారు. మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న గ్రామంలో చెంచు కుటుంబాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎందుకు వెనుకబాటుకు  గురి అయ్యారో సమగ్ర విచారణ చేసి సదుపాయాలను కల్పించాలన్నారు.