30 May, 2026 | 2:31 AM

గుండారం రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి

30-05-2026 01:23 AM

బెజ్జంకి, మే 29: గుండారం పెర్కబండ గ్రామాల నుంచి బెజ్జంకికి వెళ్లే బీటీ రోడ్ గుంతలు, పగుళ్లతో ప్రమాదకరంగా మారిందని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు వడ్లూరి పరుశరాములు తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా చెట్ల కొమ్మలు రోడ్డుపైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ మార్గంలో వడ్ల లోడ్ లారీలు, ట్రాక్టర్లు, బస్సులు అధికంగా రాకపోకలు సాగిస్తుండటంతో రైతులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. గతంలో చాలా  ప్రమాదాలు జరిగినట్లు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టడంతో పాటు చెట్ల కొమ్మలను తొలగించాలని వడ్లూరి పరుశరాములు డిమాండ్ చేశారు.