1 April, 2026 | 8:16 PM

ఆగిపోయిన రోడ్డు పనులు

15-05-2024 02:26 AM

రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న రోడ్డు పనులు 

ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు

ఇల్లు కోల్పోయిన వారి కష్టాలు వర్ణణతీతం

సిద్దిపేట/ కొండపాక, మే14 (విజయక్రాంతి) : సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామం మధ్యలో మెయిన్‌రోడ్డు చిన్నగా ఉండడంతో వెడల్పు చేసేందుకు స్థానిక నాయకులు శ్రీకా రం చుట్టారు. ఇరువైపులా పలు ఇండ్లను తొలగించారు. రోడ్డు డివైడర్‌ను ఏర్పాటు చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు ఇరుపక్కల విద్యుత్ సౌకర్యాలను స్తంభాలను ఏర్పాటు చేశారు. దీని కోసం రూ. 3.40 కోట్లు వెచ్చించారు. మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొండపాక అభివృద్ధి కోసం రూ. 10కోట్ల మంజూరు చేశారు. ఆ నిధుల నుంచి గ్రామాన్ని తీర్చిదిద్దడం కోసం శివాలయం నుంచి ఉన్నత పాఠశాల వరకు రో డ్డు వెడల్పు చేసే పనుల కోసం తీర్మానించారు. డివైడర్ పనులు ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమయ్యాయి. అలాగే విద్యు త్ స్తంభాలను ఇరువైపులా ఏర్పాటు చేశా రు. కానీ పనుల్లో జాప్యం కావడంతో మురుగునీరంతా రోడ్డుపై ఉన్న గుంతల్లో నిండి గ్రామంలో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

అసలు గ్రామం మధ్య నుంచి రోడ్డు వెడ ల్పు చేయడం అవసరం లేదని, రోడ్డు నిర్మిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని కొందరు అభ్యంతరాలు చెప్పినా, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి పట్టుబట్టి రోడ్డు పనుల కోసం అందరితో తీర్మానం చేయించారు. దీంట్లో ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇస్తామని చెప్పి కొంతమందికే కేటాయించారు. గ్రామానికి చెందిన వెల్కటూ రు బాలయ్య అనే వ్యక్తి ఇల్లు కోల్పోయాడు. తనకు డబుల్‌బెడ్‌రూం ఇల్లు ఇస్తామని ఇవ్వనందుకు రోడ్డుకు అడ్డం గా రాళ్లగోడ కట్టి నిరసన వ్యక్తం చేశారు. వెడల్పు చేస్తే గ్రామం సుందరంగా ఉంటుందని ఒప్పుకున్నామని, రెండు సంవత్సరాలు అయినా పనులు పూర్తి చేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు వాపోయారు. ప్రారంభ సమయంలో నాయకులకు ఉన్న శ్రద్ధ ప్రస్తుతం లేదని, పనుల విషయంలో అసలు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా రోడ్డు పనులు పూర్తి చేసి రోడ్డును సౌకర్యవంతంగా మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.