5 May, 2026 | 11:44 PM

శరత్ సమగ్ర సాహిత్యం

27-05-2024 12:05 AM

కొన్ని పుస్తకాలకు, కొందరు సాహితీవేత్తలకు కాలానికి అతీతంగా చెక్కు చెదరని విలువ, గొప్పతనం చిరస్థాయి గా నిలిచి వుంటాయి. వారు సృష్టించిన సారస్వత కళాఖండాలు తరతరాలుగా నిరంతరం చదువరులకు బదిలీ అవుతూనే ఉంటాయి. అటువంటి అనేక ఉద్గ్రంథాలు, అపురూప పుస్తకాలు ఎల్లవేళలా అందరికీ లభ్యం కావడం కూడా కష్టమే. ఆ తరహా మహనీయులలో ముందువరుసలో వుండదగిన వారు శరత్ చంద్ర. యావత్ భారత సాహిత్య చరిత్ర గర్వించదగ్గ మహా రచయిత శరత్ చంద్ర చట్టోపాధ్యాయను తెలుగు పాఠకులు ఎంతగా సొంతం చేసుకున్నారంటే, ‘శరత్‌బా బు అంటే ఎవరో కాదు, తెలుగువారే’ అన్నంతగా అనుబంధం పెనవేసుకుపోయింది. ఆయన కథలు, నవలలు చదవని వారికి సైతం ఒక ‘దేవదాసు’, ‘తోడికోడళ్లు’, ‘వాగ్దానం’ వంటి అలనాటి అపురూప సినిమాలు మనో ఫల కంపై ఇప్పటికీ నిలిచే వుంటాయి. ఎంతో విలువైన, ఎంద రో పాఠకులు హృదయ పూర్వకంగా కోరుకొనే ‘శరత్ సమ్రగ సాహిత్యం’ మొత్తం పది సంపుటాలు పునర్ముద్రణ జరిగాయి.

‘ప్రియదర్శిని ప్రచురణలు’వారు వెలువరించిన ఈ సంపుటాలకు సంపాదకులు వత్సల కాగా, బొందలపాటి శివరామకృష్ణ తెలుగులోకి అనువదించారు. మొదటి సంపుటంగా విడుదలైన 500 పేజీల ‘శ్రీకాంత్’ నవల ఒక్కటి చూస్తే చాలు, మనకు మిగిలిన సంపుటాల విలువ తెలిసిపోతుంది. శరత్ నవలలు, నవలికలు, కథలు, వ్యాసాలతోపాటు లేఖలు సైతం ఈ సంపుటాలలో భాగంగా పుస్తకరూపంలోకి వచ్చాయి. వాటిలో దేవదాసు, చరిత్రహీనులు, భారతి, భైరవి, బడదీది, నిష్కృతి, సవిత, దత్త, గృహ దహనం, శుభద, పల్లీ సమాజ్, విరాజ్‌బహు, పరిణీత, నవవిధాన్, పంతులుగారు, పూజారిణి, నవలికలు, ఇతరత్రా వ్యాసాలు, లేఖలు వున్నాయి. శరత్ రచన ఏదైనా మొదటి పేజీలోకి వెళితే చాలు, ఆసాంతం మనలను వదలకుండా చదివిస్తూనే ఉంటుంది. ఇదే ఈ అద్భుత పుస్తకాల గొప్పతనం.

శరత్ సమ్రగ సాహిత్యం, పది సంపుటాలు సంపాదకులు: వత్సల, 

తెలుగు అనువాదం: బొందలపాటి శివరామకృష్ణ, ప్రచురణ: ప్రియదర్శిని ప్రచురణలు, 

ప్రతులకు: ప్రియదర్శిని ప్రచురణలు, ఫ్లాట్ నం. 308, ప్రతాప్ హైలైన్ అపార్ట్‌మెంట్, బసంత్ లేన్, 

కాచిగూడ ఎక్స్ రోడ్స్, హైదరాబాద్‌ేొ27, 

సెల్: 9010873311 లేదా ప్రముఖ పుస్తక కేంద్రాలు.