27 July, 2026 | 6:30 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

‘కథ చెబుతా వింటారా’ కథల పోటీ

02-06-2026 01:27 AM

హనుమకొండ అర్బన్, జూన్ 1 (విజయక్రాంతి): హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆరట్స్ అకాడమీ చిన్నారులకు తెలుగు పట్ల మక్కువ పెంచాలని, అమ్మ భాష ఐన తెలుగు భాషని గౌరవించాలని, మరుగున పడుతున్న సంస్కృతిని వికసింపజేయాలనీ, తెలుగు భాష మీద పట్టు, పదాల కూర్పు, సమయస్ఫూర్తి, వ్యాఖ్య నిర్మాణం, భాష సరళత, విలువలు, పద ధారలత, చక్కని వ్యాఖ్యనం ఇవ్వన్నీ పెంపొందించే దిశగా ‘కథ చెబుతా వింటారా’అనే పేరుతొ కథలు చెప్పే పోటీని నిర్వహిస్తున్నామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మంజుల సాగంటి తెలిపారు.

జూన్ లో ఈ పోటీ నిర్వహిస్తామని చిన్నారులు వారి పేరు వివరాలు 8143643337 నెంబర్ లో నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు. చిన్నారుల చేత ఇంట్లోనే 2 నిముషాలు నిడివి గల నీతి, విలువలు కలిగిన ఒక కథను చెప్పించి వీడియో తీసి వాట్సాప్ కు పంపితే, ఎంపిక చేయబడిన చిన్నారులకు న్యాయ నిర్ణేతల ముందు పోటీ నిర్వహిస్తామని తెలిపారు.

1,3 తరగతులు, 4,6 తరగతులు, 7,10 తరగతులు 1,2,3 విభాగలుగా పోటీ ఉంటుందని,3 నిమిషాల వ్యవధిలో కథ చెప్పవలసి ఉంటుందని, నీతి, విలువలు, మంచిని పెంచేలా కథలు ఉండాలన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రం అందజేస్తామని, విజేతలకు బహుమతులు అందించబడతాయని చెప్పారు. చెప్పే కథ వ్రాత ప్రతితో ఫోటో జత చేసి అందించాల్సి ఉంటుందని, ఎంపిక చేయబడిన చిన్నారుల కథలన్ని పుస్తకరూపంలో అచ్చు వేయబడతాయని ఆమె తెలిపారు.