2 June, 2026 | 2:43 AM

స్టాన్లీ కాలేజీలో ఈఎస్‌డీపీ ర్యాంప్

02-06-2026 01:27 AM

15 రోజుల స్టార్టప్ ప్రోగ్రామ్ ప్రారంభం

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): మహిళా ఇంజనీరింగ్ విద్యార్థినుల్లో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉ మెన్ క్యాంపస్‌లో 15 రోజుల ‘ఆంట్రప్రెన్యూర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రా మ్’ (ఈఎస్‌డీపీ) సోమవారం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ‘ర్యాంప్’ (రైజింగ్ అండ్ యాక్సెలరేటింగ్ ఎంఎస్‌ఎమ్‌ఈ పర్ఫార్మెన్స్) పథకంలో భాగంగా ‘ఏఐసీ అలీప్ వీ-హబ్’ భాగస్వామ్యంతో ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

మహిళా విద్యార్థినుల్లో వ్యాపా ర దృక్పథం, ఆవిష్కరణలు, స్టార్టప్ స్థాప న, ఎంఎస్‌ఎమ్‌ఈ రంగంలో లభించే ని ధుల అవకాశాలపై అవగాహన కల్పించడం ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ఈ 15 రోజుల పాటు నిపుణుల ఉపన్యాసాలు, మెంటరింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా విద్యార్థినుల సరికొత్త ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా మార్చేందు కు తగిన శిక్షణ ఇస్తారు. అలీప్ ప్రెసిడెంట్ కే రమాదేవి మాట్లాడుతూ.. మహిళా ఇం జనీర్లు కేవలం ఉద్యోగాల కోసమే పరిమి తం కాకుండా, స్వయంగా స్టార్టప్స్ స్థాపిం చి నలుగురికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ఆమె పిలుపునిచ్చారు. 

ర్యాంప్ ప్రోగ్రా మ్ ద్వారా అలీప్ సంస్థ విద్యార్థినులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఏఐసీ అలీప్ వీ-హబ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహూరుల్లా ఎస్ మాట్లాడు తూ.. విద్యార్థినులు తమలోని సరికొత్త ఆలోచనలకు పదునుపెట్టి ఆత్మవిశ్వాసంతో పారిశ్రామిక రంగంలోకి అడుగుపె ట్టాలన్నారు. 

ఈ కార్యక్రమం స్టాన్లీ విద్యాసంస్థల చీఫ్ పాట్రన్స్  కె. కృష్ణారావు (కరస్పాండెంట్), టి. రాకేశ్ రెడ్డి (డైరెక్టర్), ఆర్. ప్రదీప్‌రెడ్డి (డైరెక్టర్)ల మార్గదర్శకత్వంలో జరుగుతోంది. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.ఎల్. రాజు, డీన్ అకడమిక్స్ డాక్టర్ ఎ. వినయ బాబు, డీన్ ఐపీఏ డాక్టర్ సత్యప్రసాద్లు పాట్రన్స్గా వ్యవహరిస్తున్నారు. సిఎస్‌ఇ హెచ్‌ఓడీ డాక్టర్ జి. శ్రీలత, ఏఐ, డీఎస్ హెచ్‌ఓడీ డాక్టర్ కె. వైదేహిలు కన్వీనర్లుగా వ్యవహరిస్తుండగా, ఎం. లావణ్య మారెళ్ల ఫ్యాకల్టీ కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.