17-02-2026 02:03:28 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి) : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అదే జరిగింది. జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి తెలంగాణలో వింత పొత్తులు సరికొత్త చర్చకు దారితీశాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకున్న రాజకీయ పార్టీల నేతలు.. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని సాధించేందుకు ఒకటయ్యారు.
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ తమ బద్ధశత్రుత్వాన్ని పక్కనపెట్టి, చేతులు కలిపి స్నేహాన్ని చాటుకోవడం రాజకీయవర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిం ది. ఎన్నికలు వచ్చాయంటే కిందిస్థాయి కార్యకర్తలు.. పార్టీ నిబంధనలకు కట్టుబడి, పార్టీ అభ్యర్థుల కోసం చెమటోడ్చి కష్టపడుతారు. తాను పోటీచేసినట్లుగానే భావిం చి.. ప్రత్యర్థి పార్టీల నాయకులతో తలపడే వరకు వెళ్తారు. ఒకానొక సందర్భాల్లో బంధుత్వాలు వదులుకోవడానికీ సామా న్య కార్యకర్త సిద్దపడతాడు.
కానీ, రాష్ట్రం లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, నియమావళిని, పాత పంచాయితీలను పక్కనపెట్టి ఒక్కటికావడం రాజ కీయ వైచిత్రి. సిద్ధాంత పరంగా విరుద్ధంగా ఉండటమే కాకుండా ఎప్పుడు ఉప్పు, నిప్పుగా ఉండే కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా జట్టుకట్టి ము న్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ పీఠాలను పంచుకోవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని మున్సిపాలి టీ లో బీజేకి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటై మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం వింతగా మారింది.
నిన్న, మొన్నటివరకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలలో ‘బీ’ టీమ్స్ చర్చ జరిగింది. కాం గ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని, ఆ పార్టీ బీటీ మ్‌గా బీఆర్‌ఎస్ మారిందని బీజేపీ ఆరోపించింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా.. బీ జేపీకి బీఆర్‌ఎస్ బీ’ టీమ్‌గా మారిందని వి మర్శలు చేసింది. ఇలా నిత్యం ఒక రినొకరు టార్గెట్ చేసుకున్నారు. గత అసెం బ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విమర్శలు చేసుకున్నారు.
చేతులు కలిపిన శుభవేళా..!
* నర్సాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులుండగా, కాంగ్రెస్-6, బీఆర్‌ఎస్- 5, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి ఏ పార్టీకి అవసరమైన మ్యా జిక్ ఫిగర్ రాకపోవడంతో ఇక్కడ కాం గ్రెస్, బీజేపీ చేతులు కలిపాయి. చైర్మన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ రాజు యాదవ్, వైస్ చైర్మన్‌గా బచ్చేష్ యాదవ్ ఎన్నికయ్యారు.
* ఆదిలాబాద్‌లో స్వతంత్ర అభ్యర్థి బం డారి అనూషకు చైర్మన్ పదవి దక్కింది. అక్కడ మొత్తం 49 స్థానాల్లో 21 చోట్ల బీజేపీ గెలిచి పెద్ద పార్టీగా అవతరించిం ది. కాంగ్రెస్-11, బీఆర్‌ఎస్-6, ఎంఐఎం-6, స్వతంత్రులు ఐదు చో ట్ల గెలిచారు. ఇక్కడ బీ జేపీకి వ్యతిరేకంగా కాం గ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్, ఇతరులు ఒక్కట య్యారు. బైంసాలో బీ జేపీ, కాంగ్రెస్, స్వంత్రులు కలిసి స్వ తంత్ర అభ్యర్థులను చైర్మన్‌గా దత్తత్రి, వైఎస్ చైర్మన్‌గా బీబీ కుతిజ సిద్దికి ఎన్నికయ్యారు.
* నిజాబాబాద్ కార్పోరేషన్‌లో బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్, ఎంఐ ఎం ఒక్కటై మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకున్నది. ఇక కామారెడ్డిలో బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవి బీఆర్‌ఎస్ తీసుకున్నది.
* మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా ఆలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీజేపీ, ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన శిరీష ఎన్నికయ్యారు. అలియాబాద్‌లో మొత్తం 20 వార్డులకు గాను కాంగ్రెస్-8, బీఆర్‌ఎస్-7, బీజేపీ-3, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్‌కు బీజేపీ, ఇతరులు మద్దతుగా నిలిచారు.
* వనపర్తి జిల్లా అమరచింతలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ ఒక్కటైంది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన పత్యానాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. చైర్మన్‌గా పత్యానాయక్‌కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఎల్లంపేటలో బీఆర్‌ఎస్ పార్టీకి బీజేపీ మద్దతిచ్చింది. దీంతో ఇన్నాళ్లు దూషించుకున్న పార్టీలు పదవుల కోసం రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల కలిసిపోవడం క్షేత్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.