7 April, 2026 | 11:57 AM

Breaking News

తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన.. జూనియర్ లాయర్ హత్య   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •  

నేటి నుంచే బయో ఏసియా సదస్సు

17-02-2026 02:06 AM

రెండు రోజులపాటు నిర్వహణ ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 23వ బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో రెండు రోజులపాటు ఈ సదస్సు జరగనున్నది. ఈ ప్రపంచస్థాయి సదస్సు ప్రధానంగా ‘టెక్‌బయో అన్‌లీష్డ్ - ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రం గంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్నారు.

టెక్‌బయో ఇన్నోవే షన్స్‌లో దేశం గ్లోబల్ హబ్‌గా మారుతున్న తరుణంలో, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియో గంతో లైఫ్ సైన్సెస్ రంగంలో భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణ సంబంధించిన అంశాలపై ఈ సదస్సు చర్చించనున్నది. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏర్పాటు చేసే అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.  అనంతరం బయోఏషియా సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు.

రెం డు రోజులపాటు నిర్వహించే ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తలు, బయో సైన్సెస్ రంగంలో నిష్ణాతులు ఆయా అంశాలపై ప్రసంగించను న్నారు. పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్, అమెరికాకు చెందిన ఆ మ్జెన్ చీఫ్ సైం టిఫిక్ ఆఫీసర్ డాక్టర్ హోవర్డ్ వై చాంగ్ కీలకోపన్యాసం చేయనున్నారు.

సైన్స్, సాఫ్‌వేర్ అండ్ సప్లయ్, నెక్ట్స్ జనరేషన్ బయోలాజిక్స్, ఫార్మా, బయోటెక్ భవి ష్యత్తు, ఏఐ, ఆర్‌అండ్‌డీ (డిజిటల్ ట్రాన్‌ఫార్మేషన్), గ్లోబ ల్ ఇంపాక్ట్, తెలంగాణ రైజింగ్ 2047 వరల్డ్-క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ వంటి కీలక అంశాలపై జరిగే చర్చల్లో వివిధ దేశాల నుం చి హాజరైన ప్రతినిధులు పాల్గొంటారు.