13 July, 2026 | 9:43 PM

Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •  

నిజామాబాద్ కార్పొరేషన్ హస్త'గతం'

16-02-2026 02:40 PM

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిజామాబాద్ లో ఎక్కువ వరి దిగుబడి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ... నిజామాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందేందుకు నిధులు కేటాయిస్తామని తెలిపారు.

అటు నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్త'గత'మైంది. నిజామాబాద్ మేయర్ గా ఉమారాణి, డిప్యూటీ మేయర్ గా సల్మా తహసీన్ ఎన్నికయ్యారు. ఎంఐఎం సహకారంతో నిజామాబాద్ మేయర్ గెలిచామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వెల్లడించారు. నిజామాబాద్ అభివృద్ధికోసమే ఎంఐఎంతో కలిశామని తెలిపారు. బీసీలకి నిజామాబాద్ మేయర్ పదవి కట్టబెట్టామని చెప్పారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ లను బీజేపీ అడ్డుకున్నా పార్టీ పరంగా న్యాయం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో నిజామాబాద్ అభివృద్ధి చేస్తామని మహేష్ గౌడ్ హామీ ఇచ్చారు.