01-02-2026 12:18:44 AM
విభిన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొత్త సాగు పద్ధతులు
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): చలి కాలంలో మనకి మార్కెట్‌లో ఎక్కువగాదొరికే పళ్లలో స్ట్రాబెర్రీ ఒకటి. ఇంతకు ముందు ఈ స్ట్రాబెర్రి పంట కేవలం చలి ప్రాంతాల్లోనే పందించేవారుకానీ ఇప్పుడు కొత్త సాగు పద్ధతులను మరియు విభిన్న వాతావరణ పరిస్థి తులకు అనుగుణంగా ఉండే తగిన రకాలు ప్రవేశపెట్టడంద్వారా వేరే ప్రాంతాలలో కూడా స్ట్రాబెర్రీని విజయవంతంగా సాగుచేస్తున్నారు. స్ట్రాబెర్రీ సాగు యొక్క అదనపు ప్రయోజనం ఏమిటంటే ఇది ఇతర పండ్లతో పోలిస్తే త్వరగా రాబడిని ఇస్తుంది.
స్ట్రాబెర్రీ పండ్లలో కాల్షి యం, పొటాషియం, ఇనుము, సోడియం, ఏ, బీ, సీ, ఈ విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వం టి ఖనిజాల సమృద్ధిగా ఉంటాయి. పండిన పండ్లలో ఎలాజిక్ ఆమ్లం ఉంటుంది, ఇది క్యాన్సర్, గుండె జబ్బులను నివారిస్తుంది. మన దేశంలో హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ, కాశ్మీర్, మిజోరం, మేఘాలయ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, జార్ఖండ్, నాగాలాండ్, కేరళ లలో సాగుచేస్తున్నారు. స్ట్రాబెర్రీ తెలంగాణలో పండించడానికి సాపేక్షంగా కొత్త పంట కానీ వినియోగం మాత్రం రాష్ట్రంలో బాగా పెరిగింది. ఈ పంట పట్టణంలోని ఇంటి ఆవరణలో, బాల్కనీలలో పెంచొచ్చు.
వర్టికల్ ఫార్మింగ్
నూతన సాంకేతిక పరిజ్ఞానాలలో నిలువు వ్యవసాయం (వర్టికల్ ఫార్మింగ్) ఒకటి. ఇది ఎక్కువ స్థలం లేని చోట, అందుబాటులో ఉన్న భూమిలో మొక్కలను పెంచడానికి ప్రభావవంతమైన మార్గం. పండ్ల పంటలలో, స్ట్రాబెర్రీ వేర్ల వ్యవస్థ 20 నుండి 30 సెం.మీ వరకు మాత్రమే విస్తరించి ఉంటుంది. నిలువు పద్ధతిలో తక్కువ విస్తీర్ణంలో స్ట్రాబెర్రిని పెంచడం ద్వారా ఉత్పత్తిని పెంచవచ్చు. పంట ఉత్పత్తి పెరుగుదల, వనరుల పరిరక్షణ, మానవ ఆరోగ్యంపై మంచి ప్రభావం, పట్టణ వృద్ధి, శక్తి స్థిరత్వం మొదలైన వాటి పరంగా ఇది సాంప్రదాయ వ్యవసాయం కంటే అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
తక్కువ ఖర్చుతో తయారు చేయబడిన పైపులను వర్టికల్ ఫార్మింగ్‌గా పంట ఉత్పత్తికి ఉపయోగిం చవచ్చు. ఈ పద్ధతిలో డాక్టోరియల్ పరిశోధనలో భాగంగా జీడిమెట్లలోని సీవోయీలో ప్రయోగం నిర్వహించబడింది. ఇక్కడ పీవీసీ నిలువు టవర్లలో స్ట్రాబెర్రీని పెంచే ప్రయత్నం విజయవంతమైంది. ఇందుకు 6 ఇంచుల డయమేటర్ కలిగిన ఆరు అడుగుల నల్లటి పీవీసీ పైపుకి 24 రంధ్రాలు తయారు చేసి నిల వు టవర్‌గా మార్చారు.
టవర్లను 3అడుగుల దూరంలో ఏర్పాటుచేసి, నీరు, ఎరువులు అం దించటం కోసం టవర్ల పైన డ్రిప్ లాటరల్‌ను/డ్రిప్పర్ ఏర్పాటు చేశారు. అవసరమైన నిష్ప త్తులలో మీడియాని కలిపిటవర్ లోపల ఖాళీ లు లేకుండా నింపి, ప్రతి స్ట్రాబెర్రీ మొలకను నిలువు టవర్ యొక్క రంధ్రంలో నాటాలి. ఈ పద్ధతిలో ఒక టవర్‌కు సుమారుగా 4.79 కిలోల దిగుబడి తీసుకోవొచ్చు.