17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఈ వారం వార్తల్లో..

01-02-2026 12:15 AM

మహా తొలి మహిళా డిప్యూటీ సీఎం సునేత్ర

సునేత్రా పవార్ మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 1963 జనవరి 18న జన్మించిన ఆమె రాష్ట్ర మంత్రి, లోక్‌సభ ఎంపీ పదమ్‌సిన్హ్ పాటిల్ సోదిరి. ఆమె 1985లో అజిత్ పవార్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కూడా ఎన్నికయ్యారు. గతంలో రాజ్యసభలో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించారు. 

మాలీవుడ్ డ్యుయెల్ స్టార్ 

మమ్ముట్టి.. మలయాళ చిత్రసీమలో మెగాస్టార్. నటుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఐదు దశాబ్దాల కెరీర్‌లో పలు భాషల్లో  15 సార్లు ద్విపాత్రాభినయం చేసిన ఘనత ఆయన సొంతం. విలక్షణ నటనతో, విభిన్న పాత్రలతో మరెన్నో ప్రయోగాత్మక చిత్రాలతో మెప్పించారు. 1998లో పద్మశ్రీ వచ్చింది. ఈ ఏడాది (2026)కు గాను ‘పద్మభూషణ్ పురస్కారం’ వరించింది.