15 March, 2026 | 8:05 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

పంటల విస్తీర్ణం లెక్కింపు పూర్తి

01-02-2026 12:21 AM
  1. శాటిలైట్‌తో పదివేల గ్రామాల్లో నిర్వహణ
  2. ఫిబ్రవరి 6న ప్రభుత్వానికి నివేదిక అందజేత 
  3. పీజేటీఏయూ వీసీ అల్దాస్ జానయ్య  

హైదరాబాద్/రాజేంద్రనగర్, జనవరి 31 (విజయక్రాంతి) : శాటిలైట్ ఆధారిత పంటల విస్తీర్ణం లెక్కింపునకు సంబంధించిన నివేది కను ఫిబ్రవరి 6న  ప్రభుత్వానికి అందజేయనున్నట్లు  ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ(పీజేటీఏయూ)వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. సుమా రు పదివేల రెవెన్యూ గ్రామాల్లో పంటల విస్తీర్ణం లెక్కింపు పూర్తయిందన్నారు.

సైఫాబాద్‌లోని కమ్యునిటీ కళశాలలో శనివారం మీడియా సమావేశంలో వీసీ మాట్లాడుతూ.. గత ఏడాది యూనివర్సిటీలో అధునాతన డిజిటల్ వ్యవసాయ, సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఏర్పా టు చేసి అం దులో భాగంగా అగ్రి రోబోటిక్స్ ప్రయోగశాలతో పాటు రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ ప్రయోగశాలను అధునాతన పరిజ్ఞానం తో ఏర్పాటు చేశామని తెలిపారు. గత కొన్ని మాసాలుగా శాటిలైట్ చిత్రాల ఆధారంగా ప్రతి గ్రామంలోని సర్వే నంబర్ వారీగా పంటల విస్తీర్ణా న్ని కచ్చితంగా లెక్కించే ఒక వినూత్న పథకం చేపట్టినట్లు చెప్పారు.

స్విట్జర్‌ల్యాండ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత శాటిలైట్ చిత్రాల విశ్లేష సంస్థ అయినా సర్‌మ్యాప్‌తో ఒప్పందం చేసుకొని పంటల విస్తీర్ణం లెక్క లు ప్రారంభించినట్లు చెప్పారు.  ఈ వినూత్న సాంకేతిక ప్రొజెక్ట్ ఫలితాలని వ్యవసాయ గ్రామస్థాయి సిబ్బంది పరిశీలించినప్పుడు సుమారు 90 శాతం వరకు కచ్చితంగా ఉన్నట్లు తేలిందన్నారు. రాష్ర్టంలోని మొత్తం రెవిన్యూ గ్రామాలలో సుమారు 870 గ్రామాల మ్యాపులు లభ్యం కానందున వాటిని మినహాయించి మిగతా అన్ని రెవిన్యూ గ్రామాలలో శాటిలైట్ ఆధారిత పంట లెక్కిం పు పూర్తి చేసినట్లు చెప్పారు. 

ప్రాథమిక ఫలితాల ప్రకారం సరాసరిగా మొత్తం సాగు యోగ్యమైన విస్తీర్ణంతో పోలిస్తే వాస్తవంగా పం టలు వేసిన విస్తీర్ణం 8-12 శాతం  వరకు తక్కువగా ఉన్నట్లు తేలింది. అన్ని జిల్లాలకు సంబంధించిన ఈ పంటల విస్తీర్ణం లెక్కింపునకు సంబంధించిన పూర్తి నివేదికను ఫిబ్రవరి 6న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు అందజేస్తామని వీసీ జాన య్య తెలిపారు.

ఈ లెక్కింపు వల్ల మూడు ప్రయోజనాలుంటాయన్నారు. పంటల బీమా అమలులో నష్టపోయిన ప్రతి రైతుకు భీమా పరిహారం అందించే అవకాశం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కొనుగోలులో పారదర్శకతతో పాటు సకాలంలో అమలు చేసే వీలుతో పాటు  ప్రభుత్వ పథకాల అమలులో అర్హత కల ప్రతి రైతుకి పథకాలు చేరేలా ఉపయోగపడుతుందని తెలిపారు.