5 August, 2026 | 1:54 AM

మొయినాబాద్‌లో వెలగని వీధి దీపాలు

05-08-2026 12:43 AM

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

మొయినాబాద్, ఆగస్టు 4, (విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ ప రిధిలోని పలు వార్డుల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రివేళల్లో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నా రు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత కాలనీలన్నీ చీకట్లోనే కొట్టుమిట్టాడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల అలసత్వంపై ఆగ్రహంవీధి దీ పాల సమస్యపై పలుమార్లు సంబంధిత వార్డు కౌన్సిలర్లకు, మున్సిపల్ అధికారులకు వి న్నవించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని కాలనీవాసులు వాపోతున్నారు. పరిష్కారం చూపడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని మండిపడుతున్నారు.

ప్రమాదాల ముప్పు..

చీకటి కారణంగా రాత్రి సమయాల్లో రహదారులపై గుంతలు కనిపించక వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీకటిని ఆసరాగా చేసుకుని వికృత చేష్టలు, దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉందని భయపడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, పనిచేయని వీధి దీపాలకు తక్షణమేమరమ్మతులు చేపట్టాలి. అన్ని వార్డుల్లోనూ సరిపడా వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలి మున్సిపల్ ప్రజలు అధికారులకు విన్నవిస్తున్నారు.