ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
మధిర రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వైరా ఏసిపి ఎస్.సారంగపాణి..
ఎర్రుపాలెం మార్చి 13 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్రమ రవాణా ప్రభుత్వ నిబంధనలకు లోబడి రవాణా చేయాలని అలాకాకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే అట్టి ఇసుక ట్రాక్టర్ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వైరా ఏసిపి సారంగపాణి తెలిపారు.
శుక్రవారం రూరల్ పోలీస్ స్టేష న్లో జరిగిన విలేకరుల సమావేశంలో వైరా ఏసిపి సారంగపాణి మాట్లాడుతూ మధిర ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుండి అక్రమం గా ఇసుక తరలిస్తే సతపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదేవిధంగా రాష్ డ్రైవింగ్ చేసిన త్రిబుల్ రైడింగ్ డ్రైవింగ్ చేసి న లైసెన్స్ ఆర్ సి హెల్మెట్ లేకుండా రోడ్డుపై వాహనాలు నడిపిన అలాంటి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారన్నారు.
అదేవిధంగా వైరా డివి జన్ పరిధిలోని గంజాయి తాగిన అమ్మకాలు చేపట్టిన అలాంటి వారిపై కూడా చర్య లు తీసుకోవడం జరుగుతుందని వారన్నా రు. ఇసుక అక్రమ రవాణా జరిగే సమాచారాన్ని ప్రజలు ఇస్తే సమాచారం ఇచ్చిన వారికి తగిన పారితోషం ఇవ్వటం జరుగుతుందని వారు తెలిపారు. ముందుగా ఇసుక రవాణా చేసే వారితో అవగాహన సమావే శం ఏర్పాటు చేసి తగిన సూచనలు ఇ వ్వటం జరుగుతుందని ఆతర్వాత ఇసుక అ క్రమ రవాణా జరిగితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు. విలేకరుల సమావేశంలో మధిర సీఐలు మధుర మేష్ రూరల్ ఎస్‌ఐ లక్ష్మీభార్గవి పాల్గొన్నారు.




