14 March, 2026 | 1:11 AM

దమ్మపేట మండలంలో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన

14-03-2026 12:25 AM

దమ్మపేట, మార్చి 13(విజయక్రాంతి): మండలంలోని పలు గ్రామ పంచాయతీలలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నాచారం, మారప్పగూడెం, జగ్గారం, పూసుకుంట గ్రామపంచాయతీల పరిధిలోని గ్రామాలలో రూ.45.50 లక్షల వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. గ్రామాల్లో మట్టి రోడ్ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు.

అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నాచారం గ్రామంలో నిర్వహించిన డ్రై డే కార్యక్రమంలో  పాల్గొన్నారు. గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ పారిశుధ్య కార్యక్రమాలలో అధికారులు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామ్ నరేష్, సర్పంచులు చీకటి రమాదేవి, పూనెం వెంకటేశ్వరరావు, వంకా జానకీరాముడు, మోకాళ్ళ గురుమూర్తి, దానపు నరసింహరావు, యాట్ల రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాకా రమేష్, చిన్నశెట్టి యుగంధర్, ఉపసర్పంచులు, వార్డు మెంబెర్లు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.