రోడ్డును ఆక్రమిస్తే కఠిన చర్యలు
15-08-2026 12:34 AM
మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాయితేజ
మేడ్చల్ అర్బన్ ఆగస్టు 15 (విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ కార్పొరే షన్ పట్టణ పరిధిలోని కే ఎల్లార్ ఫీజ్ 2 లో రోడ్డు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ టౌన్ ఫ్లానింగ్ ఆఫీసర్ సాయి తేజ స్పష్టం చేశారు. మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని కే ఎల్లార్ పేజ్ 2లో 60 అడుగుల రోడ్డు ను కబ్జా చేసి రేకుల షెడ్డును నిర్మించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు మున్సి పల్ శాఖ అధికారులు జేసిబి సహాయం తో శుక్రవారం తొలగించారు. మునుముందు కూడా అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాయి తేజ హెచ్చరించారు..






