23 July, 2026 | 1:51 AM

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

23-07-2026 12:00 AM

అశ్వాపురం, జూలై 22 (విజయక్రాంతి): విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అశ్వాపురం మండల కేంద్రంలో పాఠశాలలు, కళాశాలలకు చెందిన వాహనాలను పోలీసులు బుధవారం తనిఖీ చేశారు. అశ్వాపురం సీఐ సీహెచ్ ఎల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో వాహనాల ఫిట్నెస్, బీమా, ఆర్సీ, పర్మిట్, కాలుష్య నియంత్రణ (పీయూసీ) ధ్రువపత్రాలతో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, అత్యవసర ద్వారం, స్పీడ్ గవర్నర్ తదితర భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.

వాహన డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులు, అర్హతలను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ సీహెచ్ ఎల్లయ్య మాట్లాడుతూ విద్యార్థుల ప్రాణాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని, వాహనాల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించకూడదని, అన్ని ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డ్రైవర్లు, విద్యాసంస్థల యాజమాన్యాలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్త్స్ర రామచంద్రారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.