26 March, 2026 | 2:53 AM

బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు

26-03-2026 12:00 AM

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలకు కొరత లేదు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని డిప్యూటీ  సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

బుధవారం శాసనమండలి సమావేశపు హాలులో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి గ్యాస్, పెట్రోల్ సరఫరాలపై సమీక్షించారు. అపోహలు కలిగించే మాధ్యమాల కథనాలతో ఆందోళన చెందవద్దని వినియోగదారులకు సూచించారు. రెగ్యులర్ గా కొనుగోలు చేసే దాని కంటే, ఎక్కువగా కొని నిల్వ చేయవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.