8 April, 2026 | 2:43 AM

కోడెలను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు

08-04-2026 12:54 AM
  1. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

గోశాలలో రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ

వేములవాడ, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాల కోడెలను అర్హులైన రైతులకు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని, కోడెలను సంరక్షించి, సాగు పనులకు వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని శ్రీ రాజరా జేశ్వర స్వామి గోశాలలో రైతులకు మంగళవారం కోడెల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ అం దజేశారు.

ప్రభుత్వ విప్, కలెక్టర్ కు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇంచార్జి ఈఓ అంజనారెడ్డి పుష్పగుచ్చం అందజేసి, స్వాగ తం పలికారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి పత్రాలను అధికారులు తనిఖీ చేస్తుండగా, ప్రభుత్వ విప్, కలెక్టర్ పరిశీలించి, రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగాశ్రీ రాజరాజేశ్వర స్వామివారికి కోడెను కట్టే సంస్కృతి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉందని గుర్తు చేశారు. భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొ క్కు చెల్లింపు అని వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లో రైతులకు తిప్పాపూర్ గోశాలలో ఉచితంగా స్వామివారి కోడెలను పంపిణీ చేస్తు న్నామని తెలిపారు. పంపిణీ చేసిన కోడెలను తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. కోడెలను పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ పరిధిలో అధునాతన సౌకర్యాలతో సువిశాల స్థలంలో గోశాల నిర్మాణానికి రా ష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

రూ.150 కోట్లతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కోడెలను రైతులు సంరక్షించాలని సూచించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ఆన్లైన్ లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్న రైతులకు కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతులు ఆన్లైన్ లో దరఖాస్తులను వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీ చేసిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పరిసర జిల్లాలకు చెందిన 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు అర్హులైన రైతులకు మాత్రమే పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.

అర్హులైన రైతులకు కోడెల పంపిణీ నిరంతరం చేస్తామని తెలిపారు.కోడెలు, వ్బుసైట్ లో రైతుల వివరాలు నమోదు చేయడంతో జీవాలు పక్కదారి పట్టే అవకాశం ఉండదని, భవిష్యత్తులో వాటి సంరక్షణను పరిశీలించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.కోడెలను తీసుకువెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా ప క్కాగా చూసుకోవాలని సూచించారు. వాటి ని ఎల్లప్పుడూ అధికారులతో తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. గోశాలలో కోడెల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటు న్నా మని, గడ్డి, నీరు, అందిస్తున్నామని, దాదాపు 8 కూలర్లు ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు.

జిల్లా పశు వైద్యాధికారి, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. గోశాలలో మొత్తం 210 జతల కోడెలను అర్హులైన రైతులకు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈకార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కె ట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, ఆర్డీఓ రాధాభాయ్, ఆలయ ఇంచార్జి ఈఓ అంజనారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ జయంత్ కుమార్, వ్యవసాయ, రెవెన్యూ, ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.