19 April, 2026 | 10:00 AM

గోవులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు

30-05-2025 09:26 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): బక్రీద్ సందర్భంగా గోవులను తరలించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య అన్నారు. జిల్లా సరిహద్దులో గోవుల రవాణా నిలువరించడానికి పోలీసులు ప్రత్యేకంగా తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తనిఖీ కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై దీపిక, సిబ్బంది పాల్గొన్నారు.