4 July, 2026 | 8:49 PM

Breaking News

దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •   కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు   •  

చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు

28-06-2025 12:00 AM

ఏఎస్పీ చిత్తరంజన్ హెచ్చరిక

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్27 ( విజ యక్రాంతి): మానవ అక్రమరవాణా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  ఏఎస్పీ చిత్తరంజన్ హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా కేసులో మరో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మానవ అక్రమ రవాణా కేసులో 10 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. పది రోజుల క్రితం 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగిందన్నారు. ఇదే కేసులో మధ్యప్రదేశ్ కు చెందిన మరో ఇద్దరు నిందితుల కోసం దర్యాప్తు చేయగా శుక్రవారం పట్టణంలోని బస్టాండ్ ఏరియా లో ఏ7 బషీర్ రమేష్ గౌడ్, ఏ9 జగదీష్ సోనీలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు.

మానవ అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్ హరిదాసును విధుల్లో నుంచి డిస్మిస్ చేశామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ  సమావేశంలో సిఐ  రవీంద ర్, ఎస్సై అంజయ్య  పాల్గొన్నారు.