24 August, 2026 | 4:23 AM

అధికారులకు ఘనంగా సన్మానం

28-06-2025 12:00 AM

మందమర్రి, జూన్ 27: సింగరేణిలో విధులు నిర్వహించి ఈ నెల 30న పదవి విరమణ పొందనున్న అధికారులను సింగ రేణి ఏరియా జీఎం జీ దేవేందర్ ఘనంగా సన్మానించారు. శుక్రవారం జీఎం కార్యాల యంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పదవి విరమణ పొం దనున్న బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జిఎం సుశాంత్ సాహూ, జిఎం కార్పొరేట్ సోలార్ జానకిరామ్‌లను వేరు వేరుగా ఏర్పాటు చేసి న కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జిఎం విజయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుం దర్, ఎస్కే గ్రూప్ ఏజెంట్ ఖాదీర్, ఎస్‌ఇ ఐఇడి కె కిరణ్ కుమార్, పర్చేస్ అధికారి బా బు, ఏరియా అధికారులు పాల్గొన్నారు.