15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాలి

28-06-2025 12:00 AM

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్

ఆదిలాబాద్, జూన్ 27 (విజయక్రాంతి):  కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదింటి ఆడబిడ్డలకు లక్ష రూపాయల కల్యాణలక్ష్మీ చెక్కుతోపా టు తులం బంగారాన్ని అందించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని భీంపూర్ మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా సవారీ బంగ్లా షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.

అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమం లో పాల్గొని 32 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116/- చొప్పున 32,03,712/- రూపాయల చెక్కులను అందజేశారు.

ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గాల్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ లక్ష చెక్కుతో పాటు హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం అందజేస్తామని చెప్పి ఏడాదికిపైగా కాలం గడుస్తున్న ఇంతవరకు హామీ ని నిలబెట్టుకో లేదన్నారు. ఈ కార్యక్రమం లో అధికారులు, బీఆర్‌ఎస్ మండల నాయకులు అభిమానులు పాల్గొన్నారు.