శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
17-06-2026 01:54 AM
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
ఇల్లంతకుంట, జూన్ 15 (విజయక్రాంతి): శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ మహాష్ బి. గితే అన్నాడు, మంగళవారం ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ను ఆకస్మీకంగా తనిఖీ చేశా డు. పోలీస్ స్టేషన్ లోని రికార్డులను, నేర చరిత్ర కలిగిన వారి వివరాలను పరిశీలించాడు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని, గంజాయి మత్తుకు యువత బానిసకావద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తు పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయన్నాడు, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దని, ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నాడు. ఎస్పీ వెంట సిరిసిల్ల రూరల్ సిఐ నాగేశ్వర్ రావు, ఎస్ ఐ సిరిసిల్ల అశోక్ ,పోలీస్ సిబ్బంది ఉన్నారు.






